హన్మకొండ, నేటిధాత్రి:
గ్రేటర్ వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 5వ డివిజన్లోని ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ర్యాలీ నిర్వహించిన అధికారులు
స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న 5వ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మన డివిజన్ పరిసర ప్రాంతాలు మరియు పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే మలేరియా డెంగు చికెన్ గున్యా బోధ వ్యాధి మెదడువాపు మొదలగు వ్యాధులను అరికట్టే విధంగా చెట్లు నాటి కాలుష్య నివారించేందుకు కృషి చేయాలని వీటన్నిటి గురించి ఇంకా ఎక్కువ అవగాహన పెంచి అందరి ఇళ్లలో దోమల బెడద లేకుండా పూల కుండీలు తదితర పాత్రలలో నీరు నిలవకుండా చూసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఏఈ హరికుమార్ గారు. వర్క్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు. జూనియర్ అసిస్టెంట్. డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి. కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రావణ్ కుమార్. సోషల్ మీడియా అధ్యక్షుడు గుత్తికొండ సురేందర్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవల్లి రాకేష్. ఆర్పీలు. అంగన్వాడీ టీచర్లు. ఆశా వర్కర్లు. మున్సిపల్ సిబ్బంది. బూత్ కమిటీ సభ్యులు. కాలనీవాసులు. తదితరులు పాల్గొన్నారు