కాప్రా నేటి ధాత్రి జనవరి 20
చర్లపల్లి సెయింట్ జోసెఫ్ కాలనీ నుంచి నేతాజీ నగర్ వరకు 450 మీటర్ల మెయిన్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
ఈ సంధర్బంగా డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేసిన అనంతరం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టామని,స్థానికులు రోడ్డు పూర్తి అయ్యే వరకు జీహెచ్ఎంసి సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,కాలనీ వాసులు,జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు