కూకట్పల్లి, మార్చి 07 నేటి ధాత్రి ఇన్చార్జి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా యువ శక్తి మహిళా మండలి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో ఆల్వి న్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరి ధిలోని పిజెఆర్ నగర్ లో నిర్వహిం చిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా స్థానిక కార్పొరేటర్ దొడ్ల
వెంకటేష్ గౌడ్ హాజరవడం జరిగిం ది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా
ఉంటేనే కుటుంబం ఆరోగ్యాంగా ఉంటుంది అని అన్నారు. కుటుంబ బాధ్యతల్లో నిరంతరం మమేకమై ఉండే మహిళల కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన యువ శక్తి మహిళా మండలి వారిని అభి నందించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్,భాస్కర్,యాదగిరి,మహే ష్,శ్రీను,హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు తూటే విజయ్ కుమార్,సామాజిక వేత్త మధు బాబు చికిలే,యువ శక్తి మహిళ మండలి అధ్యక్షురాలు గణిత,బృంద సభ్యులు మాధు రి,సరిత,వాసంతి,రాధిక,సలహా
దారులు ఫణి కుమార్, మల్లారెడ్డి ఆసుపత్రి బృందం మహ్మమూద్ మరియు వైద్యులు పాల్గొన్నారు.