Warning Against Drying Grains on Roads
రోడ్లపై మొక్కజొన్న,ధాన్యాలు ఆరబెట్టరాదు
గుండాల సిఐ లోడిగ రవీందర్
గుండాల,నేటిదాత్రి:
గుండాల మండలంలో ప్రధాన రోడ్లపై మొక్కజొన్న సహా ఇతర ధాన్యాలను ఆరబెట్టడం వల్ల వాహనాలు స్కిడ్ అవుతున్న ఘటనలు చాల ఉన్నాయని రహదారులు జారుడు స్వభావం పొందడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇటీవలి రోజులలో ఉదయం సమయంలో మంచు పెరగడం వల్ల రోడ్డు స్పష్టత తగ్గి, వాహనదారులకు ముందున్న రహదారి కనిపించక ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి అని గుండాల సీఐ రవీందర్ అన్నారు.
ప్రధాన రహదారుల్లో మొక్క జొన్నలు, ధాన్యలు అరపోసే రైతులకు,ప్రజలకు వాహనదారులకు తగు సూచనలు పాటించాలని తెలిపారు.
రహదారులపై మొక్కజొన్న, ధాన్యాలు, పంట అవశేషాలను ఆరబెట్టరాదు.
ఇది చట్టపరంగా కూడా నేరం, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది.
మీ భూములలో, పొలాల్లో లేదా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మాత్రమే పంటలను ఆరబెట్టాలి.
రోడ్డుపై ధాన్యం కొరకు కర్రలు, రాళ్లు అడ్డు పెట్టడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అలా చేయరాదు.
మంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహన వేగాన్ని తప్పనిసరిగా తగ్గించాలి.
హెడ్లైట్లు లో బీమ్ లో ఉంచి, ఇండికేటర్లు ఆన్ చేయాలి.
ముందు వెళ్తున్న వాహనానికి సరైన దూరం పాటించాలి.
రోడ్డు మధ్యలో తడి,ధాన్యం పంట అవశేషాలు కనిపిస్తే వెంటనే వేగం తగ్గించాలి.
అత్యవసరమైతే మాత్రమే ఉదయం ప్రయాణించాలి.
పోలీస్ శాఖ తరఫున
ప్రజల భద్రత కోసం అందరూ ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా కోరారు.
ప్రతి ప్రాణం విలువైనది. రోడ్డు నియమాలు పాటించి బాధ్యతగా నడపండి, ప్రమాదాలు నివారించండి అన్నారు.
