
సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
కాంట్రాక్ట్ వర్కర్స్ నాన్ పర్మినెంట్ ఎంప్లాయిస్ సమస్యల పరిష్కారానికి దశల వారి ఆందోళన పోరాట కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ పిలుపునిచ్చారు.
గురువారం చండూరు మండల కేంద్రంలో సిఐటియు చండూరు మండల కమిటీ సమావేశం సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం అధ్యక్షతనజరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టం వచ్చింది. 30% అప్రెంటిసీలకు అవకాశం ఇచ్చారు. పరిశ్రమలలో వివిధ రకాల పేర్లతో అనేక రూపాల్లో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. చట్టబద్ధంగా కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు పర్మినెంట్, పార్ట్ టైం, కాంట్రాక్ట్, కమిషన్ బేస్డ్ ,క్యాజువల్, అప్రెంటిసి, ట్రైనీషిప్, ప్రొహిబిషన్ తదితర కొత్త కొత్త పేర్లతో పరిశ్రమలలో నియామకాలు చేసుకుంటున్నారని, వీరికి తక్కువ వేతనాలు ఇస్తూ అపాయింట్మెంట్ లెటర్స్ ,గుర్తింపు కార్డులు, ప్లే స్లిప్పులు, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాడ్యుటీ లాంటి చట్టబద్ధ సౌకర్యాలు ఏమీ కల్పించడం లేదని అన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయకుండా 12 గంటలు పని చేయిస్తున్నారని, ఓవర్ టైం పేరుతో అదనంగా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం తో కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయని అన్నారు. ప్రభుత్వ శాఖలలో స్కీం వర్కర్లు, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిన, విద్యుత్ రంగంలో ,ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ పద్ధతిన వేలాది మందిని నియమించుకొని ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ,ఉద్యోగ భద్రత లేకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ భద్రత లేకుండా వివిధ పేర్లతో పనిచేస్తున్న కార్మికుల సమస్యల అధ్యయనం కోసం సెప్టెంబర్ నెల లో సర్వే చేయాలని సిఐటియు అఖిలభారత కమిటీ నిర్ణయించిందని తెలిపారు. సెప్టెంబర్ 11 నుండి 16 వరకు వివిధ ప్రాంతాలలో ఉద్యోగులు కార్మికులను కలిసి సర్వే చేసి సమస్యలు గుర్తించి సంతకాల సేకరణ చేయాలని కోరారు. సెప్టెంబర్ 20 నుండి 26 వరకు అధికారులకు వినతి పత్రాలు, సమస్యలపై ముద్రించిన కరపత్రాల పంపిణీ, వివిధ సంస్థలలో గ్రూప్ మీటింగ్స్, సదస్సులు జరుపాలని, అనంతరం ఈనెల 28న జిల్లా కలెక్టరేట్ మహాధర్నా ,30న చలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతుందని అన్నారు. నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమాల జయప్రదం కోసం కార్మిక వర్గం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం,చిట్టిమల్ల లింగయ్య,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ఉపాధ్యక్షులునల్లగంటి లింగస్వామి, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు పున్న వేదావతి,కే.శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు