TPTF Plays Key Role in Strengthening Education System
టిపిటిఎఫ్ నిబద్ధతగల బలమైన సంఘం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషి
టిపిటిఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరి ఉద్ఘాటన.
ఉపాధ్యాయ హక్కుల సాధన కై, సంక్షేమానికై నిరంతర పోరాటం
నాణ్యమైన విద్యను అందించడమే సంఘం ప్రధాన లక్ష్యం
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఉవాచ
కేసముద్రం/ నేటి ధాత్రి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపిటిఎఫ్) కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో టీపిటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ (2026) ఆవిష్కరణ కార్యక్రమం కేసముద్రం మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ, “టీపిటిఎఫ్ ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ, విద్యావ్యవస్థ బలోపేతం లో కీలక పాత్ర పోషిస్తోందని” ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని, అందుకు విద్యాశాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
అనంతరం టీపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కై నిరంతరం పోరాటం చేస్తుందని, నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యంగా టి పి టి ఎఫ్ పనిచేస్తుంది ” అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల గౌరవం, భద్రత, సంక్షేమం కోసం టీపిటిఎఫ్ ముందుండి పోరాడుతుందని, అవసరమైతే ఉద్యమాలకూ సిద్ధమని తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, స్టేషన్ కేసముద్రం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, టీపీటీఫ్ సీనియర్ నాయకులు బందెల రాజు, కల్వల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ బండారు నరేందర్, తాళ్లపూస పల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకయ్య, ఉప్పరపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు దేవ్ సింగ్, బద్రు నాయక్, వెన్నెల అనిత, ఎమ్మార్సీ సిబ్బంది ఖాదర్,బిక్షపతి పాల్గొన్నారు.
