Congress Leaders Visit Families in Ramnagar
ఉల్లెంగల యాదగిరి నేతృత్వంలో పరామర్శలు
రాంనగర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల పరామర్శ కార్యక్రమం
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు మండలం రాంనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ నాయకుడు ఉల్లెంగల యాదగిరి నేతృత్వంలో గ్రామస్తురాలు ఉల్లెంగల ఉప్పలమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
పల్లంకొండ గోపయ్యను పరామర్శించిన యాదగిరి అదేవిధంగా, మండల కాంగ్రెస్ నాయకుడు పల్లంకొండ గోపయ్య అనారోగ్యంతో ఉన్నట్లు తెలుసుకున్న యాదగిరి,
వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు.
ఛాగంటి వెంకటయ్య ఆరోగ్యం గురించి ఆరా
మండల రజక సంఘం మాజీ అధ్యక్షుడు ఛాగంటి వెంకటయ్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలోఉల్లెంగల యాదగిరి వ్యక్తిగతంగా పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యాదగిరితో పాటు,గుడికందుల చంద్రయ్య
మండల రజక సంఘం ఉపాధ్యక్షులు లొంక సుధాకర్ మండల రజక సంఘం కార్యదర్శి పెద్దమ్మగడ్డ హనుమకొండ రాజేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు
