
Collector Warns Against Use of Forest Lands in Wanaparthy
వనపర్తి జిల్లాలో అటవీ శాఖ భూములలో నిర్మాణాలు ఇతరులకు అప్పగించారాదు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లాలో అటవీ భూమిలో ప్రభుత్వం ద్వారా ఏమైనా అసైన్మెంట్ చేసి ఉంటే అట్టి భూమిని గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ తో సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ గెజిట్ ప్రాకారం అదేవిధంగా సెక్షన్ 4 ప్రకారం గుర్తించిన అటవీ శాఖ భూమిలో ఎలాంటి నిర్మాణాలు ఇతరులకు అప్పగించడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు వనపర్తి జిల్లాలోని అటవీ భూమినీ ఎక్కడైనా పొరపాటున అసైన్మెంట్ చేసి ఉంటే అ భూమిని సర్వే నెంబరుతో గుర్తించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కమిటీలో ఫారెస్ట్ అధికారి ఆర్డీఓ ఎ.డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ తహసిల్దార్ తో కమిటి ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి
ఆర్డీఓ సుబ్రమణ్యం ఎ .డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ, ఆర్ అండ్ బి అధికారి పాల్గొన్నారు