త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి.

త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి

హైదారాబాద్ లోని చేనేత భవన్ లొ ప్రత్యేక సమావేశం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి భవన్, మార్కండేయ ఆలయా నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి లోని చేనేత భవన్ లో పద్మశాలి భవన్ నిర్మాణం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో మధ్యలో ఆగిపోయిన పద్మశాలీల కుల భవనము, మార్కండేయ స్వామి ఆలయం నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు..బీసీ సంక్షేమ శాఖ ద్వారా 5 కోట్ల నిధుల విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడం జరిగిందన్నారు..టెస్కో నుంచి కూడా ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరడం జరిగింది అని తెలిపారు..ప్రస్తుతం పిల్లర్లు పోసిన భవనాన్ని స్లాబ్ వరకు తీసుకువచ్చి, మరో 3 కోట్ల 40 లక్షలతో కళ్యాణ మండపం నిర్మాణం పూర్తిచేసుకుని, అందులో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.. మరో 2 కోట్లతో మార్కండేయ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మొత్తం 11 కోట్లతో అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు..
చేనేతలకు ప్రభుత్వ పక్షాన పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ ఇప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పవర్లూమ్ కార్మికులకు పని కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా తల్లులకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తున్నట్లు తెలిపారు.. గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ అంత్యోదయ కార్డులను అందజేసినట్లు గుర్తు చేసుకున్నారు.

భవిష్యత్తులో చేనేత, పవర్లూమ్ కార్మికులకు సంబంధించి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజా ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు.. ప్రభుత్వమిచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పింది వింటునట్లు తెలిపారు.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిందని అన్నారు..నేతన్నల ఎన్నో ఏళ్ల కల 50 కోట్లతో యారన్ డిపో ఏర్పాటు చేసినట్లు తెలిపారు..పేదలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,బీసీ వేల్పర్ అధికారులు బల మాయదేవి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version