మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
అంబేద్కర్ సెంటర్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మున్సిపల్ కమీషనర్ కి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ టీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ మాదిగ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ నియోజకవర్గ ఇంచార్జి హరీష్ మాదిగ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి రాకేష్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద గల స్టాప్ లో బస్ షెల్టర్ లేకపోవడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. వచ్చేది ఎండాకాలం కనుక ప్రయాణికులు నిలబడడానికి కనీసం నీడ కూడా లేదు కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు బస్ షెల్టర్ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించి నిర్మాణం చేపట్టాలి అని నూతనంగా వచ్చిన కమీషనర్ ని కలిసి వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల సతీష్ మాదిగ లు పాల్గొన్నారు.