
*గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి *
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం లో గల కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శుక్రవారం, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాత, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, గారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వందల ఏండ్ల బ్రిటిష్ రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దుచేసి మన దేశ ప్రజల హక్కుల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం గా నిర్వహించు కుంటామన్నారు. ఎందరో మహానీయులు చేసిన త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగం జనవరి 26, 1950 అమలులోకి వచ్చిన నాటి నుంచి మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగాన్ని రచించిన మహనీయులను ఎప్పటికీ స్మరించుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు.అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను క్రింది స్థాయి ప్రజల వరకు అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.దేశ స్వాతంత్య్రం మీద నేటి యువతకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత జాతి నిర్మాణ సమర యోధుల జీవిత విశేషాలను యువతకు తెలియ జేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు ,మహిళ నాయకులు ,మహిళ కార్యకర్తలు,అభిమానిలు ,కాలనీ వాసులు, పిల్లలు. స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు