Constitution Day Celebrations in Bhupalpally
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బిజెపి నాయకుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొంగల రాజేందర్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన మహానీయుడని అన్నారు ఈరోజు ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ విద్య ఉపాధి రాజకీయ రంగాలలో ఈ స్థాయికి ఎదిగారు అంటే భారత రాజ్యాంగం వల్లనే అని ఆయన అన్నారుదేశంలో ప్రతీ పౌరుడికి సమాన హక్కులు కల్పించి, అందరికీ స్వేచ్చను అందించిన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ..
దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బట్టు రవి బిజెపి అర్బన్ అధ్యక్షులు గీస సంపత్ కుమార్, అజ్మీరా రాజునాయక్, .టేకుమట్ల బిజెపి మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు.,పెదవెన కిరణ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు
