
CGHS Wellness Centre Proposed in Warangal
సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ కోసం కుడా కార్యాలయ పై అంతస్తు పరిశీలన
పరకాల నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు కోసం ప్రత్యేకంగా నడిపించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఈ సందర్భంగా వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకై భవనాల ఎంపిక కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)కార్యాలయం పై అంతస్తును వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
సిజిహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్.రోహిణితో సందర్శనకు వచ్చిన సందర్భంగా,ఛైర్మన్ వారికి మర్యాదపూర్వకంగా పూల కుండీని అందించారు.అనంతరం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పీవో అజిత్ రెడ్డి తో కలిసి కార్యాలయాన్ని పరిశీలించారు.వరంగల్ లో కొత్తగా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయటం వలన వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.సీజీహెచ్ఎస్ ఒక కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ అయినప్పటికీ,వెల్నెస్ సెంటర్లలో ప్రాథమిక ఓపీడీ చికిత్స సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది.ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా లబ్ధి చేకూరనుంది.