కాప్రా నేటిధాత్రి 10:
జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం వాటర్ బాడీస్ క్లీనింగ్ అనగా నీటి వనరుల ప్రాంతాలను శుభ్రం చేయడంలో భాగంగా కాప్రా, చర్లపల్లి ఎర్రకుంట నాచారం హెచ్.ఎం.టి నగర్ నాచారం చెరువుల ప్రాంతాలను జి.హెచ్.హెచ్.ఎం.సి కార్పొరేషన్ శానిటేషన్ విభాగము మరియు ఎంత మాలజీ విభాగము సిబ్బంది వారి వారి విభాగాలకు సంబంధించిన పనులను చేసి చెరువుల పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి జిహెచ్ .ఎం .సి .చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ , మరియు కాప్రా సర్కిల్ మెడికల్ ఆఫీసర్ మధుసూదన్ రావు, నాచారం ఎర్రకుంట చెరువు మరియు హెచ్.ఎం.టి చెరువును సందర్శించారు, కాప్రా చెరువు ప్రాంతాల్లో జి.హెచ్. ఎం.సి స్వచ్ఛ భారత్ మిషన్ విభాగము నుండి డాక్టర్ శంకర్ , మరియు డాక్టర్ రజనీకాంత్ , కాప్రా చెరువు పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ జవాన్ శ్రీనివాస్ మరియు ఎస్ .ఎఫ్. ఏ. వసంత వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్, చెరువుల పరిసరాల శుభ్రత మరియు నీటి వనరుల శుభ్రత మనందరి బాధ్యత అని ఇలా కాపాడుకోవడం వలన భూగర్భ జలాలు కూడా కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడమే కాకుండా నీటి కాలుష్యము వాతావరణ కాలుష్యము కాకుండా నీటిలో నివసించే చేపలు వంటి జలచరాలను కూడా కాపాడిన రమవుతామని తెలియజేశారు.