జిల్లా మహ సభల కరపత్రాల ఆవిష్కరణ
పరకాల నేటిధాత్రి(టౌన్)
శుక్రవారం రోజున పట్టణ కేంద్రంలోని అమరధామంలో జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగం విచ్చలవిడిగా నాశనమైందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు చెప్పడమే తప్ప అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.కెసిఆర్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా పేద విద్యార్థులకు అందని ద్రాక్ష లాగా మారిపోతుంది అన్నారు.ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు అలాగే ఎస్సెమ్మెహెచ్ హాస్టల్స్ కు సొంతభవనాలు లేవన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు.లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,సందీప్ రాజ్ కుమార్,ఈశ్వర్,వినయ్, అభిలాష్,తరుణ్,శివ,రాకేష్, గణేష్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.