గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలంలోని కాచనపల్లి ఆశ్రమ హై స్కూల్,శంభూనిగూడెం హైస్కూల్, మామకన్ను హై స్కూల్, గుండాల జిల్లా పరిషత్ హై స్కూల్, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లను సందర్శించి తెలంగాణ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని మంగళవారం విస్తృతంగా ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు, జిల్లా కార్యదర్శి భూక్యా బాలు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎస్ పూర్ణచంద్రరావు, గుండాల మండల అధ్యక్షా ప్రధాన కార్యదర్శులు కాంతారావు,బి వెంకటేశ్వర్లు, మండల నాయకులు మురారి, విజయ్,కెన్నెర రాజు, ఐ రామచంద్రయ్య, మిగతా మిత్రులు పాల్గొని విజయవంతానికి కృషి చేయాల్సిందిగా కోరారు.పాఠశాలలో తిష్ట వేసుకుని ఉన్నటువంటి సమస్యల పరిష్కారం సమాజం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు విద్యారంగా ప్రగతికి అవరోధంగా ఉన్నటువంటి సవాళ్లను పరిష్కరించడం కోసం విద్యా వైజ్ఞానిక మహాసభలలో మేధావుల చేత అట్టి విషయాలు చర్చించబడి ప్రభుత్వానికి ఒక ప్రత్యామ్నాయ డాక్ మెంటును అందించే ప్రయత్నం జరుగుతా ఉంది దీంట్లో ఉపాధ్యాయులు ఉద్యోగులు మేధావులు, విద్యార్థులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఉద్దేశిస్తూ పూర్వ టిపిటిఎఫ్ కార్యదర్శి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ 317 జిఓ బాధిత ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి సీపీఎస్ రద్దుచేయాలని బదిలీలు,పదోన్నతులు వెంటనే జరపాలని, నిరుద్యోగుల స్వప్న మైన మెగా డిఎస్ సి మరియు టీ ఎస్ పిఎస్ సి ఉద్యోగాలు నింపాలని డిమాండ్ చేశారు.