సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం విప్లవోద్యమంలో అమరులైన అమరుల ఆశయాలను కొనసాగిస్తూ నవంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు గ్రామ గ్రామాన అమరవీరుల సంస్కరణ సభలు ఘనంగా నిర్వహించాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కొమరం సీతారాములు, గుండాల మండల కార్యదర్శి అరేం నరేష్ పిలుపునిచ్చారు.
గుండాల మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ప్రసంగిస్తూ 1969 లో సిపిఎం నయా రివిజనిజంని వ్యతిరేకిస్తూ దున్నేవానికి భూమి కావాలని నినాదంతో పనిచేస్తూ అనేకమంది అమరవీరులు తమ విలువైన ప్రాణాలను పేద ప్రజలకు అంకితం చేశారని, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి లోయ పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల పోడు భూములు కొట్టించి పేద ప్రజల బతుకులలో వెలుగులు నింపారని కొనియాడారు.
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు విప్లవ పార్టీలు, ప్రజాస్వామిక శక్తులను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పర్శక రవి, బచ్చల సారన్న, పెండేకట్ల పెంటన్న, గుండాల ఉపసర్పంచ్ మానాల ఉపేందర్, బానోతు లాలు, ఎస్ కే అజ్గర్, పాయం యల్లన్న, దుగ్గి రియాజ్, కల్తీ నరసింహారావు, పొడుగు జార్జి, మోకాళ్ళ బుచ్చయ్య, వజ్జ ఎర్రయ్య, గొగ్గెల శ్రీను తదితరులు పాల్గొన్నారు