
Congress Workers Urged to Strive for Victory
కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఉప సర్పంచ్ గోపాల్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అదుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని, ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామన్నారు.