*కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం*
*పార్టీ కోసం… పార్టీ గెలుపు కోసం… లక్ష్యంగా కష్టపడి పని చేద్దాం…!*
*ఐకమత్యంగా గడపగడపకు ప్రచారం చేద్దాం…*
*కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి…*
*టి పి సి సి ఓ బి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్*
*కేసముద్రం/ నేటి ధాత్రి*
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపిసిఓ బిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ పాల్గొన్నారు. అనంతరం వీరన్న యాదవ్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీ నూతనంగా ఆవిర్భవించిందని దానికి అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నామని కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ లు కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటు కొరకు ఎంతో కృషి చేశారని వారి కృషి ఫలితమే నేడు కనిపిస్తుందని అన్నారు. రేపు జరగబోయే కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 16 వార్డుల స్థానాలకు పోటీ చేసి 16 కౌన్సిలర్ల అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా అందరూ ఐకమత్యంగా నిలిచి కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పెట్టుకొని పని చేద్దాం అని అన్నారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్దేశించిన అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ఈ ఎన్నికల బరిలో నిలబడాలని అనుకున్న ఆశావాహులు ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని, టికెట్ రాలేదని ఎవరు బాధపడొద్దని జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారని ఇచ్చిన హామీలను మాట తప్పకుండా మహిళలకు ఉచిత బస్, గృహజ్యోతి ఉచిత కరెంటు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ నిధి పెంపు, రైతు రెండు లక్షల రుణమాఫీ, పథకాలను నెరవేర్చారని ఈ పథకాలను గడపగడపకు ప్రతి ఇంటింటికి ఓటర్లకు వివరిస్తే గెలుపు సునాయాసంగా కాంగ్రెస్ పార్టీకే సొంతం అవుతుందని అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పని చేస్తే విజయం మన సొంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు తోట వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాసాడి శ్రీను, మండల ఓబిసి సెల్ అధ్యక్షులు చిట్ల సంపత్, మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి, బ్లాక్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు బైరు వెంకన్న, మాజీ వార్డ్ మెంబర్ మేకల లచ్చమ్మ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లం చర్ల సతీష్, గ్రామ యూత్ అధ్యక్షులు యనమల మహేందర్, ఇద్దరమ్మా కమిటీ సభ్యులు సోసు కండ్ల సుభాష్ రెడ్డి, అజ్మీర దేప్లా, పెండ్యాల లక్ష్మణ్, జిలకర బాబు, బానోత్ కైక, ఎండి అమీర్, ఎలపాటి యాకోబ్ రెడ్డి, ఉల్లి వెంకటేశ్వర్లు, భాష బోయిన వెంకన్న, కీర్తి సంపత్, గుండు లక్ష్మీనారాయణ, కీర్తి సారయ్య, గూగులలోతు వీరమ్మ, వాంకుడోత్ కమల, తదితరులు పాల్గొన్నారు.
