
Congress Workers
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం
◆:- యువ నాయకులు మహ్మద్ హఫీస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల చిల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మహ్మద్ హఫీస్ మాట్లాడుతూ
అధికారంలోకి వచ్చిన 18 నెలలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్న లను పొందింది అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో, పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారన్నారు. జరగబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి,రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పంచాయతీలు, వార్డులలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ ఓట్లను అడిగి ఎంపీటీసీ జెడ్పిటిసిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.