చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బి.వై నగర్ లోని చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ మాట్లాడుతు గత ప్రభుత్వహయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంతన్న హయాంలో పేద, ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది.
నేడు సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరూ కూడా వాళ్ల పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ కూడా కడుపునిండా భోజనం తింటున్నారని పేద ప్రజలందరి కళ్ళలో సంతోషం వ్యక్తం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ సామల రోజా సుధ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి కాజా పాల్గొన్నారు.