* పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
పద్మశాలి సమాజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సేవ చేస్తుందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. సిరిసిల్లలోని శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ సర్కస్ వాళ్ళు వచ్చినట్లు అప్పుడప్పుడు వచ్చి అనవసర మాటలు మాట్లాడుతూ వెళ్తున్నాడని ఇక అలాగే చేస్తే కేటీఆర్ ను సిరిసిల్లలో తిరగనివ్వమని ఆయన అన్నారు. అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు గత ప్రభుత్వంలో నిర్బంధంలో ఉండేవారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో స్వేచ్ఛగా పని చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేటీఆర్ దిక్కుమాలిన ప్రభుత్వం అని మాట్లాడం సరైంది కాదని రేవంత్ రెడ్డి ముందుచూపుతో ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ చీరలతో పదిమంది సేట్లను బతికించిన ఘనత కేటీఆర్ దేనని అన్నారు. కొంతమంది కమిషన్ల కోసం బతుకమ్మ చీరలను సిరిసిల్లకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పై అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, ఆ అర్హత కూడా కేటీఆర్ కు లేదని అన్నారు. సిరిసిల్లకు కొద్ది మాసాల్లోనే నూలు డిపో మంజూరు కానుంది అని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతన్నలను ఆదుకున్నాడని, మధ్యలో వచ్చిన టిఆర్ఎస్ పార్టీ పదేళ్లు పాలించి వస్త్ర పరిశ్రమను నాశనం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, వస్త్ర పరిశ్రమను బాగు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్, భీమవరం శ్రీనివాస్ , యేల్లే లక్ష్మీనారాయణ, మ్యాన ప్రసాద్, చెన్నమనేని కమలాకర్ రావు, కుడిక్యాల రవి కుమార్, దుబాల వెంకటేశం