అది ఒక స్వచ్ఛంద సంస్థ..
కొమ్ము భరత్ భూషణ్
భారతీయ జనతా పార్టీ..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
స్వాతంత్రానికి పూర్వం కాంగ్రేస్ పార్టీ రాజకీయ పార్టీ కదు అని
అది ఒక స్వచ్ఛంద సంస్థ అని
కొమ్ము భరత్ భూషణ్
అన్నారు.
స్వాతంత్ర్య అనంతరం పేరు మార్చుకోండి అని పలు మార్లు గాంధీజీ విజ్ఞప్తి చేసిన వినలేదు.
స్వాతంత్రానికి పూర్వం హిందూ మహాసభ స్వాతంత్రం కొరకే ఉద్భవించిన ఒక రాజకీయ వేదిక.
స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించింది, బ్రిటిష్ వారి ప్రాణాలు తీసింధీ.. హిందూ మహాసభ సభ్యులే. కాంగ్రెస్ వేదికలోని సభ్యుల పాత్ర చాలా తక్కువ
వీర సావర్కర్, నేతాజీ, హెడ్గేవర్, బంకించంద్ర చటోపాధ్యాయ, భగత్ సింగ్, సుకుదేవ్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ వీరంతా హిందూ మహాసభ సభ్యులేనని అన్నారు.
హిందూ మహాసభ భావజాలంతో ఏర్పడ్డదే భారతీయ జన సంఘం.
భారతీయ జన సంఘ మే నేటి భారతీయ జనతా పార్టీ
కాంగ్రెస్ లో మెజార్టీ సభ్యులు నెహ్రూ నాయకత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ, మహాత్మా గాంధీ ప్రమేయంతో నెహ్రూ భారత మొదటి ప్రధాని కాగలిగారని అన్నారు.
స్వాతంత్ర పోరాటంలో నెహ్రూ పాత్ర చాలా తక్కువ. స్వాతంత్ర్య అనంతరం నెహ్రూ కుటుంబం లబ్ధి పొందింది చాలా ఎక్కువ. దేశాన్ని రెండుగా పాకిస్తాన్, భారత్ గా చీల్చడమే కాకుండా, కాశ్మీర్ ను కూడా భారత్ నుండి వేరుపరిచే కుట్రలో భాగమే 370 ఆర్టికల్.
కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అయినప్పటికీ భారతదేశానికి ఒక ప్రధాని, కాశ్మీర్ కు ఇంకో ప్రధాని, దేశానికి ఒక జెండా ఉంటే కాశ్మీర్ కు ఇంకో జెండా ఉండేది.
ఈ విధానాన్ని నిరసిస్తూ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఉద్యమిస్తే, కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపితులు శ్యాం ప్రసాద్ ముఖర్జీని చంపడం జరిగింది.
శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానంతో ఇద్దరు ప్రధానుల, రెండు జెండాల విధానం తొలగిపోవడం జరిగిందని,
ఆది నుండి హిందూ భావజాలం గల వ్యక్తులే ఈ దేశాన్ని రక్షిస్తూ వస్తున్నారు.
హిందూ భావజాలం గల వ్యక్తుల పాలనలోనే ఈ దేశంలో ఉంటున్న మైనార్టీలకు (ముస్లిం,క్రైస్తవులు) రక్షణ కలదు అనేది నిజం.
ఈ దేశంలో కర్ఫ్యూలు, మతకలహాలు ఓటు బ్యాంకు రాజకీయాలు నేరిపే కాంగ్రెస్ పాలనలోనే జరిగాయన్నది అక్షర సత్యం.అని అన్నారు..
భారతదేశాన్ని గౌరవిద్దాం. హిందువులం, ముస్లింలం మరియు క్రైస్తవులం కలిసి భారతీయ జనతా పార్టీ కీ మరింత బలాన్ని చేకూర్చుదాం.
చరిత్ర ఏ విధంగా వక్రీక రింపబడుతది అనేటందుకు సజీవ ఉదాహరణలు
1) తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉన్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ నే తెలంగాణను సాధించింది అనేవిధంగా చూపబడటం.
2) స్వర్గీయ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండి తెలంగాణను ఇచ్చినప్పటికీ ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించకపోవడం.
కాంగ్రెస్, కమ్యూనిస్టుల రచనలు అబద్ధాలు, అబూత కల్పనలు.
నిజమైన చరిత్రలను తెలుసుకుందాం! ప్రపంచంలో భారత దేశాన్ని ముందు వరుసలో నిలుపుదామని ప్రతి ఒక్క పౌరునికి ఆయన విజ్ఞప్తి చేశారు..