
కాజీపేట ప్రజలు కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
కాజీపేట పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
కాజీపేట బస్టాండ్ నిర్మాణం అతి త్వరలో నెరవేరుస్తా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాజీపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది
“నేటిధాత్రి” హనుమకొండ
కాజీపేట పట్టణ అభివృద్ధి విషయంలో BRS-BJP పార్టీలు గత పది ఏళ్లుగా నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం స్థానిక నాటి ఎమ్మెల్యే పివి రంగారావు గారి హయాంలో చేసిన (జరిగిన) అభివృద్ధి మాత్రమే ఉన్నదని మళ్లీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సుమారు నాలుగు నెలల్లోనే కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించామని పనులు కూడా జరుగుతున్న తీరు స్థానిక కాజీపేట ప్రజలు గమనిస్తున్నారని ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉంటుందని గత బిఆర్ఎస్ పాలనలో కాజీపేట పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదని ఈ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ని గెలిపిస్తే రానున్న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలుకుతుందని తద్వారా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం చేసుకొనుటకు పునాది వేసినట్లు అవుతుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాజీపేట ప్రజల చిరకాల వాంఛ “కాజీపేట బస్టాండ్” అతి తొందరలోనే నెరవేరుస్తానని గతంలో కాజీపేట బస్టాండ్ ఉద్యమం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులుగా అయిన వ్యక్తులు నాడు పట్టించుకోలేదని నేను నా ఆధ్వర్యంలో అతి త్వరలో కాజీపేట బస్టాండ్ కల నెరవేరుస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
కాజీపేట చౌరస్తా అభివృద్ధి మరియు ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నానని కృత నిశ్చయంతో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మాట నిలబెట్టుకుంటామని లేనియెడల మళ్లీ కాజీపేట ప్రజలను ఓట్లు అడగనని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
కాజీపేట చౌరస్తా నుండి సోమిడి రోడ్డు పనులు ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రారంభించామని పనులు కూడా నడుస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని సెంటర్ లైటింగ్ ద్వారా రోడ్డు పూర్తి చేయడం జరుగుతుందని వరంగల్ పట్టణ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ద్వారా చేస్తున్నామని గత ప్రభుత్వం విజన్ లేకుండా మాస్టర్ ప్లాన్ అమలు చేయకుండా ఇష్టానుసారంగా వరంగల్ పట్టణాన్ని మొక్కలు చేసి వరంగల్ చరిత్రను సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
BRS-BJP నాయకులు వారి అభ్యర్థులు భూకబ్జాలకు చెరువులను, కుంటలను, నాళాలను కబ్జాలు చేసి వరంగల్ పట్టణాన్ని దోచుకున్నారని మతం పేరుతో ఒక పార్టీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ మరో పార్టీ ఓట్లను దండుకున్నారని 10 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి అభివృద్ధికి మాత్రమే ఉపయోగించారని కాజీపేట పట్టణ అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
కాజీపేట లో కార్నర్ మీటింగ్ విజయవంతం చేయాలని పట్టణ ప్రజలు అందరూ రేపు ఉదయం కాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలో సోమిడి రోడ్ ఆటో స్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ ఉన్నదని ఈ మీటింగ్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో స్థానిక కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, ఎలకంటి రాములు, మాజీ కార్పొరేటర్లు గుంటి కుమారస్వామి, సుంచు అశోక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్, టిపిసిసి మాజీ కార్యదర్శి సయ్యద్ రజాలి, డివిజన్ అధ్యక్షులు షేక్ హస్గర్, పాలడుగుల ఆంజనేయులు, పోగుల సంతోష్, గజపాక రమేష్, సీనియర్ నాయకులు మేకల ఉపేందర్, పసునూరి మనోహర్, క్రాంతి భరత్, తదితరులు పాల్గొన్నారు.