ఆర్యవైశ్యులకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు కేటాయించాలి.
కల్వకుర్తి/నేటి దాత్రి:
రాబోయే మున్సిపల్ ఎన్నికలలో
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆర్యవైశ్యులకు పార్టీ టికెట్ లు కేటాయించాలని పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వాస శేఖర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి బృంగి ఆనంద్ కుమార్ తో చర్చలు జరిపారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని కౌన్సిలర్ ఎన్నికలలో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆనంద్ కుమార్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం వైశ్యులకు టికెట్లు కేటాయించే విషయంలో సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ వైసీపీ బొమ్మఆంజనేయులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి కల్మీచెర్ల రమేష్,కోశాధికారి శివ్వ జగదీశ్వర్,అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్ళ పళ్లి శ్రీధర్, పోలా ప్రవీణ్,చిగుళ్ల పల్లి సతీష్,గుబ్బకిషన్, జూలూరి వీరేశ్, తదితరులు పాల్గొన్నారు.
