https://epaper.netidhatri.com/
`సికింద్రాబాద్ నుంచి పోటీ.
` అధిష్టానం ఆశీస్సులు.
` బొంతుకే గెలుపవకాశాలెక్కువ.
`బిఆర్‌ఎస్ కు స్కోప్ లేదు.
`బిజేపికి గ్రాఫ్ లేదు.
`కాంగ్రెస్‌కు ఎదురులేదు.
`ఉద్యమ నాయకుడుగా బొంతుకు మంచి పేరు.
`నగరాభివృద్ధిలో బొంతు కీలకపాత్ర.
`మేయర్‌గా సమర్థవంతమైన పాత్ర.
`వివాదరహితుడుగా గుర్తింపు.
`అన్ని వర్గాల ప్రశంసలు.
`ఏపనైనా అంకిత భావంతో చేయడమే తెలుసు.
`తెలంగాణ కోసం తెగించి కొట్లాడిరడు.
` హైదరాబాద్ మేయర్‌గా సమర్థత నిరూపించుకున్నాడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ఉద్యమ ప్రస్ధానంలో బొంతు రామ్మోహన్‌ది కీలకపాత్ర. విద్యార్ధి ఉద్యమాలనుంచి తెలంగాణ ఉద్యమ ప్రస్ధానం వరకు బొంతుది ప్రత్యేక పాత్ర. నాయకత్వం వహించడంలోనూ, విద్యార్ధులను సమీకరించడంలోనూ, వారిని చైతన్యం చేయడంలోనూ, నాడు తెలంగాణ పడిన బాధలను వివరించడంలోనూ బొంతు రామ్మెహన్ ఆనాడే సక్సెస్ అయ్యారు. విద్యార్ధి నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో విద్యార్ధి నాయకులు అంటే ముందు వరసలో వినిపించిన పేరు బొంతు రామ్మోహన్. తెలంగాణ వచ్చేదాకి తెగించి పోరాటం చేశారు. అనేక నిర్భందాలు ఎదుర్కొన్నాడు. పోలీసు కేసులు ఎదుర్కొన్నాడు. అంతే కాదు ఎన్ని నిర్భందాలు ఎదురైనా చలించలేదు. అనేక సార్లు ప్రాణాలకు ప్రమాదం ఎదురౌతుందని తెలసినా వెరవలేదు. తెలంగాణ కోసం కొట్లాట ఆపలేదు. ఎప్పుడెప్పుడు నిర్భందించాలా? ఎప్పుడెప్పుడు కిడ్నాప్ చేసుకొని పోవాలా? అని చూసేవారికి దొరక్కుకుండా, చిక్కకుండా, ఎక్కడ పోరాటం జరుగుతున్నా, ఉద్యమం జరుగుతున్నా ప్రత్యక్షమయ్యేవారు. కంటికి కునుకులేని రాత్రులు గడిపారు. కడుపు నిండా తిండిలేకపోయినా, గొంతు సవరించుకొని, బొంతు తెలంగాణ నినాదాలు చేసేవారు. ఉద్యమాన్ని ఉరకలెత్తించేవారు.
ఉదయం ఒక దగ్గర, సాయంత్రం మరో చోట, రాత్రిళ్లు ఎక్కడో నిద్ర, అర్ధరాత్రి మరొక్కడికో ప్రయాణం ఇలా తెలంగాణకోసం తెగించి కొట్లాడిన వారిలో బొ ంతు రామ్మోహన్ ఒకరు.
తెలంగాణ ఉద్యమం అంటే ఇప్పటి తరానికి పుస్తకాలలో పాఠాలు. సినిమాలలో పాత్రలు. పేపర్లలో వార్తలు. కాని ఆనాడు తెలంగాణ ఉద్యమ కారుల జీవితాలు ఎంత దుర్భరంగా వుండేవో చెప్పుకుంటే కన్నీళ్లు ఆగవు. అంతటి నిర్భంధాలను సైతం ఎదర్కొని తెలంగాణకు స్వేఛ్చావాయువులు తెచ్చిన వారిలో విద్యార్ధులది, విద్యార్ధి నాయకులదే కీలక భూమిక. బొంతు రామ్మోహన్ లాంటి విద్యార్ధి నాయకులదే పెద్ద పాత్ర. ఉద్యగులు ఉద్యమం చేసినా, రాజకీయ నాయకులు ఉద్యమం చేసినా, వారికి వారి ప్రయోజనాలు కొంత సమ్మిళితమై వుండేవి. రేపటి తెలంగాణ కోసం నిస్వార్ధంగా పోరాటం చేసింది ఒక్క విద్యార్ధులే. విద్యార్ధి నాయకులే. తెలంగాణ కోసం ఎంత కాలం ఉద్యమం చేయాలో తెలియదు. ఎన్ని సంవత్సరాలైనా, తమ జీవితాలకు భవిష్యత్తు లేకపోయినా, వచ్చే తరానికి మేలు జరగాలని కోరుకున్న ఏకైక ఉద్యమ కారులు విద్యార్ధినాయకులు. అలాంటి వారి త్యాగాలు తెలంగాణకే మణిహారాలు. అలాంటి వారికి తెలంగాణలో తగినంత ప్రాధాన్యత దక్కిందా? అంటే పూర్తి స్ధాయలో దక్కలేదనే చెప్పాలి. ఆ ఉద్యమ జీవితంనుంచి ఉద్భవించిన రాజకీయ వజ్రమే బొంతు రామ్మోహన్.
వచ్చేపార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొంతు రామ్మోహన్‌కు టికెట్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్న ఆయనకు టికెట్ భరోసాతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. ఆ మాట నిలబెట్టుకునే దిశలోనే కాంగ్రెస్ పార్టీ బొంతు రామ్మెహన్‌కు సికింద్రాబాద్ టికెట్ ఇస్తున్నట్లే సమాచారం. కాంగ్రెస్ పార్టీ సూచన మేరుక సికింద్రాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా వుంది. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నది. అందులో భాగంగా మాజీ మేయర్ బొ ంతు రామ్మెహన్‌కు టికెట్ ప్రకటించనున్నది.. ఒక రకంగా చెప్పాలటే సికింద్రాబాద్ నుంచి బొంతుకు గెలుపువకాశాలెక్కువ. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో యూనివర్సిటీలో వుండేవారు. అప్పటినుంచి సికింద్రాబాద్‌కు ఆయనకు మంచి అనుబంధం వుంది. ఆయను సికింద్రాబాద్ నియోజకవర్గంలో అందరూ గుర్తుపడతారు. మేయర్‌గా ఆయన చేసిన సేవలు కూడా ప్రజలు గుర్తుంచుకున్నారు. అంతే కాకుండా సికింద్రాబాద్ నుంచి బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు వస్తున్న ధాఖలాలు లేవు. పైగా బిఆర్‌ఎస్ ఓడిపోయింది.
ఇలాంటి సమయంలో అజాతశత్రువు లాంటి బొంతు రామ్మోహన్‌ను వ్యతిరేకించేందుకు ఎవరూ ముందుకు రాదు.
అంతే కాదు బిఆర్‌ఎస్ ఎవరిని నిలబెట్టినా, రామ్మోహన్‌ను ఇష్టపడే బిఆర్‌ఎస్ శ్రేణులు కూడా ఆయనకే మద్దుతు పలుకుతారు. ఎలాంటి శషభిషలు లేకుండా ఓట్లేస్తారు. ఇది సికింద్రాబాద్ నియోజకవర్గంలో బొంతుకు అనకూలంగా వినిపిస్తున్న మాట. అంతే కాకుండా సికింద్రాబాద్ కాంగ్రెస్‌కు కంచుకోట. అంజన్ కుమార్ యాదవ్ అక్కడ బలమైననేత. దాంతో ఆయన సపోర్టు పూర్తిగా బొంతు రామ్మోహన్‌కు వుంటుంది. సామాజిక సమీకరణాల నేపధ్యం కూడా బొంతు రామ్మోహన్‌కు బాగా కలిసి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి గతంలో బిజేపి నుంచి బండారు దత్తాత్రేయ గెలుస్తూ వచ్చేవారు. గత ఎన్నికల్లోనూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలిచారు. అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన కిషన్ రెడ్డి , కలిసి వచ్చిన అదృష్టంతో సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రి అయ్యారు. అయితే నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోలేదన్న అపవాదు వుంది. కేంద్ర మంత్రిగావ ఉండి కూడా కరోనా సమయంలో పెద్దగా ప్రజలు ఉపయోగపడిరది లేదు. కేంద్ర క్యాబినేట్ మినిస్టర్ అయినా రాష్ట్రానికి ఆయన సాధించినంది ఏమీ లేదు. ముఖ్యంగా సికింద్రాబాద్‌కు ఒరగబెట్టిందేమీలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అందువల్ల ఈసారి కిషన్ రెడ్డి ఓటమి ఖాయమని అనేక సర్వేలు చెబుతున్నాయి. అసలు ఈసారి ఎన్నికల్లో బిజేపికి గ్రాఫ్ లేదు అన్న వార్తలే వినిపిస్తున్నాయి. దాంతో కాంగ్రెస్‌కు ఎదరులేకుండా పోయింది. బొంతు రామ్మెహన్ గెలుపుకు అడ్డు ఏదీ వుండదు. సికింద్రాబాద్ నుంచి బొంతురామ్మోహన్ సునాయాసంగా గెలిచే అవకాశం వుంది. నగర మేయర్‌గా ఆయన చేసిన సేవలు కూడా సికింద్రాబాద్ ప్రజలకు పూర్తిగా తెలుసు. ఒకప్పుడు హైదరాబాద్‌లో మంచినీటి సమస్య ఎలా వుండేదో తెలియంది కాదు. మేయర్ రామ్మోహన్ ప్రత్యేక దృష్టిపెట్టి, నీటి కొరత లేకుండా చేశారు. అదే సమయంలో ప్రజల్లో ఉద్యమనాయకుడిగా బొంతుకు మంచి పేరుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మేయర్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నగరాభివృద్దికి ఎంతో కృషి చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే మేయర్‌గా సమర్ధవంతమైన పాత్ర పోషించారు.
ఉద్యమైనా, రాజకీయమైనా, పాలనైనా అవలీలగా పోషిస్తానని ఆనాడే నిరూపించుకున్నాడు. మేయర్‌గా పనిచేసినంత కాలం ఎక్కడా అసమ్మతికి తావులేకుండా రాజకీయాలు చేశారు. అంటే ఆయన అందరినీ కలుపుకుపోయారు. అందరితో సఖ్యతగా వున్నారు. ఆయన మేయర్‌గా వున్న సమయంలో ఏ పార్టీ నాయకులు కూడా ఒక్క విమర్శ కూడా చేయలేదు. మేయర్ పని చేయడం లేదన్న ఆరోపణ వినిపించలేదు. తమకు అన్యాయం జరిగిందని ఏ వర్గం జిహెచ్‌ఎంసి మీదకు ధర్నాకు దిగింది లేదు. అంతలా అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూసి, నగరాభివృద్దిని పరుగులు పెట్టించారు. మున్సిపల్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రజలకు పానల మరింత చేరువ చేశారు. ప్రజల పిర్యాధులను పూర్తి చేసి, మన్నననలు పొందారు. అందుకే రెండోసారి ఆయన సతీమణి శ్రీదేవిని చర్లపల్లి కార్పోరేటర్‌గా పోటీ చేసినా ప్రజలు గెలిపించారు. మేయర్ చేసిన అభివృద్దికి నిరద్శనంగా ఆ గెలుపునందించారు. వివాదరహితుడిగా గుర్తింపు. అన్ని వర్గాల ప్రశంసలు. ఏపనైనా అంకితభావంత చేయడమే తెలుసు. తెలంగాణ కోసం తెలించి కొట్లాడిరడు. హైదరాబాద్ నగర మేయర్‌గా తన సమర్ధతను నిరూపించుకున్నాడు. రాజకీయాల్లో మరోసారి తన భవితవ్యం తేల్చుకునేందుకు సికింద్రాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. ప్రజల భరోసాతో, కాంగ్రెస్‌పార్టీ ఆశీస్సులతో ముందుకు సాగనున్నారు.