
Ravi Shankar
నారాయణపూర్ పై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు లేదు
ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్
ఐదేళ్లు నారాయణపూర్ ప్రజలకు ముఖం చూపించకుండా తప్పించుకు తిరిగిన చరిత్ర నీది కాదా?
రైతు సమస్యలు, ప్రజా సంక్షేమంపై పూర్తి అవగాహన ఉన్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 43 కోట్లు మంజూరు చేయించిన ఘనత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ది
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్
గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో విలేకరుల సమావేశం
గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు లేదు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్, నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ఐదేళ్లు మొఖం చాటేసిన ఘన చరిత్ర ఆయనది. సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరితే, రాళ్ల వర్షం పడి పంట నష్టపోయాం అనుకోవాలని రైతులకు నిర్లక్ష్యమైన సమాధానమిచ్చిందెవరో రైతులు మరచిపోరన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏనాడైనా సకాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన చరిత్ర నీకుందా, పంటలు సాగు చేయడానికి ముందే నారాయణపూర్ రిజర్వాయర్ కు సాగునీటిని విడుదల చేయించి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయలేక పోయింది. అబద్ధపు హామీలు పబ్బం గడుపుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. నారాయణపూర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారమైన ఇప్పించావా, పుట్టిన ఊరు అని చెప్పుకునే నువ్వు నారాయణపూర్ గ్రామానికి ఏం చేశావు, మధురానగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి, పరిహారం కోసం రూ.43 కోట్లు మంజూరు చేయించిన గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతు సమస్యలపై, సంక్షేమంపై అవగాహనతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారు. ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ, వాటిని పేపర్లో చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాజీ ఎమ్మెల్యే రవిశంకర్కు ఏమి చేతకాదు అని నిరూపితం కావడంతోనే, చొప్పదండి నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారం మానుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బసి బుచ్చన్న,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,బూర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రోమాల రమేష్, సాగి అజయ్ రావు,వేముల అంజి,మంత్రి మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.