కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పని చేయాలి

కాంగ్రెస్ పార్లమెంటరీ సన్నహాక సమావేశంలో బూత్ కమిటీలకు పిలుపు

-వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హసన్ పర్తి / నేటి ధాత్రి

మే 13 న జరిగే లోకసభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బూత్ కమిటీలకు, కార్యకర్తలకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ ఎర్రగట్టుగుట్ట, కే ఎల్ ఎన్ కన్వెన్షన్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన హాసన్ పర్తి మండల బూత్ కమిటీల సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డా. కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.కడియం కావ్య మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని, పార్లమెంట్ ఎన్నికల్లో బూత్‌కమిటీ సభ్యులే కీలకం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ కు ఓటు వేయించే బాధ్యతను తీసుకోవాలని, వర్ధన్నపేట అభివృద్ధిని పక్కన బెట్టి భూ కబ్జాల పై దృష్టి పెట్టిన అరూరికి అసెంబ్లీ ఎన్నికలల్లో ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే బీజీపీలో చేరిన ఆరూరికి మరోసారి బుద్ది చెప్పాలని, కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే మతతత్వం పెరిగిపోతుందని విమర్శించారు.
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పి, కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావాలని,
మీ ఇంటి బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తి అవ్వగానే … శ్రీరాం సాగర్, దేవాదుల కల్వల ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా.. మడికొండ డంపింగ్ యార్డు తరలింపు విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.అంత అవగాహన లేకుండా నేను మాట్లాడను. జన వాసాలకు దూరంగా డంపింగ్ యర్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలి అంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి. బిజెపి గత పదేళ్ల లో తెలంగాణకు చేసింది ఏమి లేదు. తెలంగాణ లో బీజేపీ ఎం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని, విభజన చట్టంలోలోని ఏ ఒక్క హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చ లేదు. బీజేపీకి ఓటు వేసి బ్రతుకులను ఆగం చేసుకోవద్దు. బీజేపీ అభ్యర్థి గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లొనే వందల ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్తులు అన్ని ఎక్కడి నుండి వచ్చాయి. అవినీతి, అక్రమాలు, భూకబ్జాల ద్వారానే వచ్చాయి కదా అని ప్రశ్నించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య చెతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య, పెరుమాండ్ల రామకృష్ణ, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!