#అభివృద్ధి చేయండి అంటే….. కాంగ్రెస్ పార్టీకి భయమెందుకు.
#ఒక్క రోడ్డు నిధులు ల్యాప్స్ అయినా పూర్తి భాద్యత ఎమ్మెల్యే దొంతిదే.
# రోడ్ల పనులు ప్రారంభం అయ్యే వరకు మండలప్రజలకు మద్దతుగా ఉంటాం.
#కమిషన్ల కోసం కక్కుర్తి పడే వ్యక్తి ఎవరో…. నియోజకవర్గ ప్రజలకు తెలుసు.
#మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి..
నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకొని మండల అభివృద్ధిపై దృష్టి సారించాలని లేనియెడల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల చేత గుణపాఠం తప్పదని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి అన్నారు శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక నిధులతో మండలంలో 14 బీటీ రోడ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తుంటే జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు కమీషన్లు అంటూ మాజీ ఎమ్మెల్యే పై చిల్లర, చౌక బారు మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు..ఏవరు కమిషన్లకు ఆశపడి ప్రాజెక్టు ఆపారో….. కాంట్రాక్టర్ల దగ్గర ఏవరు కమీషన్లు తీసుకుంటారో….. నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసన్నారు.ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉకదంపుడు మాటలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తే బాగుంటుందని.ప్రజలు మాకు ఈ ఐదేళ్లు ప్రతి పక్ష పాత్ర ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం మండల ప్రజల పక్షాన సమర్ధవంతంగా పోరాడుతామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడవక ముందే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మండలంలోని మంజూరైన14 బీటీ రోడ్లను వేసవికాలంలోపు పూర్తి చేయకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగడం కూడా కష్టమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ భాద్యులు గందే శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, సట్ల శ్రీనివాస్ గౌడ్,ఎంపీటీసీ జన్ను జయరావ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఎం.డి నన్నేసాహెబ్, గాదె కేశవరెడ్డి, యువ నాయకులు అంబరగొండ రాజు, గుమ్మడి వేణు తదితరులు పాల్గొన్నారు..