
Medical College.
కొత్త సీసాలో పాత సార కాంగ్రెస్ పాలన,,,,,
టిఆర్ఎస్ ప్రోసెసింగ్ ల పైనే శంకుస్థాపనలు,,,,,
మెదక్ మెడికల్ కాలేజీ తెచ్చింది మేము,,,,
వంద పడకల నుండి 50 కి కుదించారు,,,,
19 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి రాలేదు ఎమ్మెల్యే తేలేదు,,,,
, 25 కోట్ల ఎస్ డి ఎఫ్ నిధులను తీసుకొచ్చే దమ్ముందా?
కేసీఆర్ చేసిన పథకాలనే చెప్పుకుంటున్నారు,,,,,,
అంతం కాదు ఆరంభం దేనినైనా ఎదుర్కొంటాం,,,,,
అడిగిన వారిపై దౌర్జన్యాలు కేసులు ఇకనైనా మానుకోవాలి,,,,,
ప్రజలు అమాయకులు కారు ఎప్పుడు మోసపోరు,,,,,,
విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.
రామాయంపేట జూలై 4 నేటి ధాత్రి (మెదక్)

కొత్త సీసాలో పాత సారా పోసినట్లు కాంగ్రెస్ బి ఆర్ ఎస్ యొక్క పథకాలను తమ పథకాలుగా నూతనంగా ప్రవేశపెట్టినట్లు చెప్పుకుంటున్నదని మెదక్ మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు ఆమె రామయంపేట పట్టణంలోని టిఆర్ఎస్ నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు జరిగి 19 నెలలు కావస్తున్న ఒక పైసా అభివృద్ధి జరగలేదని జరిగిందంతా శూన్యమైన అని ఆమె విమర్శించారు టిఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన ప్రొసీడింగ్ ఇచ్చిన తెచ్చిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మళ్లీ ప్రారంభోత్సవాలు శిలాఫలకాలు శంకుస్థాపనలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టడం హాస్యాస్పదమని ఆమె అన్నారు రామాయంపేట పట్టణంలో గత వారం నుండి 12 వార్డుల్లో వివిధ ప్రాంతాల్లో తన హాయంలో తీసుకువచ్చిన అభివృద్ధి పనులను ప్రోసిడింగ్ ఇచ్చి చేసిన పనులపై కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నూతనంగా ప్రకటిస్తూ తామే తీసుకువచ్చినట్లు చెప్పుకోవడం ప్రారంభోత్సవాలు నిర్వహించడం విడ్డూరమన్నారు అన్నారు రామాయంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం టిఆర్పిఏ నుండి వచ్చిన 20 కోట్ల నిధుల నుండి 10 కోట్లకు ప్రోసిడింగ్ ఇచ్చిన అన్ని కార్యక్రమాలపై ఒక పైసా కూడా తీసుకురాకుండా కనీసం మంత్రులను ముఖ్యమంత్రిని కూడా కల్వకుండా సిద్ధంగా ఉన్న తన ఐయంలో ప్రొసీడింగ్ ఇచ్చిన కార్యక్రమాలపై ప్రారంభోత్సవాలు శిలాఫలకాలు కొబ్బరికాయలు కొట్టడం ఆమె ప్రశ్నించారు కెసిఆర్ హయంలో ఇచ్చిన అభివృద్ధి పనులను పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకొంటూ తాము చేసినట్లు పాత నిధులను వాడుకుంటూ కొత్త నిధులకు ఏమాత్రం కూడా తీసుకురావడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద అభివృద్ధి పనులకు గాని ఎలాంటి కొత్త నిర్మాణాలకు ఒక్క పైసా లేదని బహిరంగంగా చెప్పడం ఇది టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమాలని ప్రజల ముందుకు కాంగ్రెస్ చేసింది అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు కేబుల్ 33 నూతన ట్రాన్స్‌కో కార్యాలయాలను నిర్మించిన ఘనత తమరి అన్నారు సుమారు 30 కరెంటు కార్యాలయాలు నిర్మించినట్లు ఆమె తెలిపారు డబుల్ బెడ్ రూమ్ లకు కోటి రూపాయలతో రోడ్డు ప్రకటించి ప్రొసీడింగ్ ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ అని ఆమె అన్నారు దానిపై కూడా ఎమ్మెల్యే తన గట్టు అభివృద్ధి ప్రకటించుకొని ప్రారంభోత్సవం చేశారన్నారు మీకే దమ్ముంటే నిలిచిపోయిన 25 కోట్ల ఎస్డిఎఫ్ నిధులను తీసుకువచ్చి చేసి చూపండి అభివృద్ధి చేయండి మేము కూడా హర్షిస్తామని ఆమె అన్నారు కెసిఆర్ పై అడ్డగోలుగా మాట్లాడితే అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు కేసులు దౌర్జన్యాలు మాని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి అభివృద్ధి కొరకు నిధులు తేవాలని ఆగిపోయిన రామాయంపేట 25 కోట్ల మెదక్ 50 కోట్ల ఎస్ డి ఎఫ్ నిధులు తేవాలని ఆమె డిమాండ్ చేశారు మెదక్‌కు మెడికల్ కాలేజీని అసెంబ్లీలో ప్రకటింపజేసి వంద పడకల నర్సింగ్ మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగిందని ఆమె సమావేశంలో ప్రోసిడింగ్ పేపర్‌ను చూపించడం జరిగింది దాన్ని మెదక్ ఎమ్మెల్యే తానే మెడికల్ కాలేజీ ప్రొసీడింగ్ తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు అంతేకాక 100 పడకల మెడికల్ కాలేజీని 50 పడకల కాలేజీ గా మార్చడం జరిగిందని ఆమె అన్నారు గత ప్రభుత్వంలో ఇల్లు కూడా రాలేదన్న వాదనపై ఆమె రామాయంపేట పేదవారికి 304 ఇల్లు ఇవ్వడం జరిగిందన్నారు రామాయంపేట మెయిన్ రోడ్డు మసీద్ నుండి గాంధీ వరకు 10 కోట్ల 84 లక్షల రూపాయలతో వేసే రోడ్డులో నష్టపోయే వారికి 54 ఇండ్లను కూడా నిర్వహించిన సంగతి తెలుసుకోవాలని ఆమె గుర్తు చేశారు రామాయపేటకు డివిజన్ ను డిగ్రీ కాలేజీని తీసుకువచ్చామన్నారు డివిజన్ తీసుకువచ్చిన ఇంతవరకు గెజిట్ రాలేదన్న విలేకరుల ప్రశ్నకు ఆ పని 19 నెల నుండి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నడిపించవలసిందిగా చేయవలసిన బాధ్యత వారిదని ఆమె అన్నారు రామాయంపేట క్రీడల స్టేడియం గురించి అడిగినప్పుడు వాటికి సంబంధించి స్టేడియం నిధులు తిరిగి వెళ్ళిపోయాయని అది కూడా కాంగ్రెస్ అయం లేని జరిగిందని ఆమె ఆరోపించారు మండల పరిషత్ కార్యాలయంలోని పశువుల ఆస్పత్రి 50 సంవత్సరాల నుండి కూడా శిథిలవస్తులో ఉండి కూలిపోయిన విషయంలో ప్రశ్నించగా దానికి నిధులు కేటాయించామని కానీ ఇప్పుడు ఉన్న అధికారం నాయకులు పట్టించుకోవడంలేదని ఆమె అన్నారు ప్రజలు అమాయకులు కారని వారు ఎప్పటికీ మోసపోరని తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జరుగుతుందన్నారు

ఈ కార్యక్రమంలో రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ సి ఎస్ సి సి ఎస్ చైర్మన్ భాజీ చంద్రం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి మాజీ ఎంపీటీసీ ఎస్కే హైమద్ కొండల్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఉమామహేశ్వర్ ఆస్నూద్దీన్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు