కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలననే..! ప్రతీకార పరిపాలన కాదు…!
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజాపాలనే తప్ప ప్రతీకార పరిపాలన కాదని,ఎన్నికలవేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం రాజ్యాంగంలోని భాగమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ అమరవాది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కార్యకర్తలు, నాయకులు, కార్యక్రమ సమన్వయకర్త అంజన్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ భారీ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలవేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాపు అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, ఆవశ్యకతను తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో దాచుకోవడం, దోచుకోవడమే తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని తెలిపారు.
బిజెపి పాలకులు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను కాలరాస్తు, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జంగం కళ, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, కుర్మ సురేందర్, బత్తుల వేణు, సంఘ రవి, మహిళా నాయకురాలు పుష్పా, శారద, రాజేశ్వరి, సునిత ,కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.