
కార్మికులను బానిసలుగా చేస్తున్న బిజెపి మోడీ ప్రభుత్వాలు
కార్మికులను బానిసలు చేయడంలో బిజెపి మోడీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
కార్మికుల పని గంటలు పెంచడమంటే కార్మికుల స్వేచ్ఛ జీవితాలను హరించడమే
పని గంటలు పెంచుతు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలి.
సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో జీవో ప్రతుల దగ్దం.
దూలం శ్రీనివాస్
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు.
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 నుంచి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని విడుదల చేసిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలని 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని జీవో ప్రతులను దగ్దం చేయడం జరిగింది.అనంతరం దూలం శ్రీనివాస్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…
కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ సంకీర్ణ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తు కార్మిక వర్గానికి ఉన్న 49 చట్టాల నుంచి 29 చట్టాలను రద్దు చేసి 4 లెబర్ కోడ్ ల రూపంలో దాడి చేస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం అంటునే బిజెపి ప్రభుత్వం కంటే ముందే ఒక అడుగు ముందుకు వేసి 10 నుంచి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని జీవోను విడుదల చేయడమంటే,బడాపెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని బానిసలను చేసే కుతుహలం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఎక్కువ ఉన్నట్లు ఉంది. కార్మికుల వేతనాలు పెంచండి మహాప్రభో అంటు కార్మిక వర్గం ముక్త కఠంతో వేడుకుంటున్న పట్టించుకోకుండా ఇలా పని గంటలు పెంచడం దుర్మార్గం. పని గంటల పెంపుతో కార్మికుని వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితాన్ని హరించడమే. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలని కార్మికుల వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని లేని యేడల బిజెపి మోడీ ప్రభుత్వంపై కార్మికవర్గం ఏలాంటి పోరాటం చేస్తుందో ఐక్యంగా, ఆ పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వంపై కూడా చేయడానికి కార్మిక వర్గం వెనకడదని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు మందమర్రి అధ్యక్ష కార్యదర్శులు జి. ఐలయ్య, యం. నర్సయ్య, నాయకులు రాజశేఖర్, సంగి పోషం , దుర్గయ్య, లక్ష్మణ్, పోసు, శంకరమ్మ, మల్లమ్మ, రజిత,కళావతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.