భద్రాచలం నేటిదాత్రి
మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే *తెల్లం వెంకట్రావు వెంట మానుకోట కి తరలి వెళ్లారు.
టిపిసిసి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం నుంచే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకొని అక్కడి నుంచి సుమారు 150 కార్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే మానుకోట బహిరంగ సభకు
పోరిక బలరాం నాయక్ విజయమే ధ్యేయంగా సభకు తరలి వెళ్లారు.
*పోరిక బలరాం నాయక్ విజయం కోసం భద్రాచలం నుంచి తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు.
టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసు నాగ సతీష్,భద్రాచల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, పట్టణ కార్యదర్శి దొడ్డిపట్ల కోటేష్,రత్నం రమాకాంత్, కొండశెట్టి కృష్ణమూర్తి, ఇందుల రమేష్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, మైనార్టీ సెల్ పార్లమెంట్ ఎలక్షన్ ఇంచార్జ్ మహమ్మద్ జిందా,బంబోతుల రాజీవ్, చింతాడి చిట్టిబాబు, నర్రా రాము, ధనకొండ ప్రసన్న, చింతాడి రామకృష్ణ,రాజశేఖర్, హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి బత్తుల కృష్ణారెడ్డి, ఎండి నవాబ్,నాగేంద్ర, గాడి విజయ్, భాను, బండారు నాగేశ్వరరావు, కొప్పుల శీను, కేతినేని లలిత,తదితర కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో సభకు తరలి వెళ్లారు.