జిపి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

పాలడుగు సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు.
గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో పి వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని కనీస వేతనం అమలు చేస్తామని ఇతర సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు కార్మికులందరూ ఎంతో ఆశతో కాంగ్రెస్ కు ఓటు వేశారని ఆ విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.గత ప్రభుత్వ హాయంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మా పోరాటానికి మద్దతు తెలిపి మేము అధికారంలోకి వస్తే అన్ని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
యూనియన్ జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో అనేక పంచాయతీలలో ఏడు ఎనిమిది నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని దీనితో కార్మికుల అర్ధాలతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తున్న బడ్జెట్ను వేతనాలకు ఇవ్వకుండా సర్పంచులు కార్యదర్శులు కుమ్మక్కై లక్షల లక్షలు డ్రా చేస్తూ కార్మికులను మాత్రం పస్తులతో పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు ఎన్ నరసింహ, గండమల్ల ఆశీర్వాదం, పి సర్వయ్య, జిల్లా విజయ్, ఎండి జహీర్, సైదులు, కె మంగారెడ్డి,వి ప్రభాకర్, బాలమ్మ, జ్యోతి,నాంపల్లి నరేష్, ఆర్ రమేష్, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!