Congress Government Supports Arya Vaishyas: MLA Megha Reddy
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికులేదే
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం, చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ప్రజాపాలన … ప్రగతి బాట బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది.ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ..
తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు.తెలంగాణ ఉద్యమంలో కర్త, క్రియగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యవహారించారు. తెలంగాణ ను సాధించడంలో ముందుభాగంలో నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతపు బిడ్డ.నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి పాల్గొన్నారు..
ఎన్టీఆర్ మొదట భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి బొగ్గు వెలికితీతకు పునాదిరాయి వేశారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రంలో ఏ జిల్లాను తొలగించడం కాని, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం కాని ప్రభుత్వ పరిశీలనలో లేవు…

జిల్లా పునర్వీభజన పైన అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత దీని పైన ఆలోచన చేస్తాం.
కుట్రలు, కుతంత్రాలతో విష ప్రచారాలు చేస్తున్నవారిని గమనించాలి..
భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు.తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.సింగరేణి కార్మికులకు సంబంధించిన మెడికల్ అన్ ఫిట్ బోర్డును రద్దు చేస్తాం..
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపైన కొందరు విష ప్రచారం చేస్తున్నారు..
మెడికల్ బోర్డు పైన విష ప్రచారం చేసే వారిని మోకాళ్లపైన కూర్చొబెట్టాలి.
సింగరేణి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సింగరేణి కార్మికులు నిండు మనసుతో పనిచేయడం వల్లనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది.ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులది. వారికి నష్టం కల్గించే పనిచేయం.217 డిస్మిస్ కార్మికుల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం.
వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారు.
డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని గత పాలకులు మాయ మాటలు చెప్పాడు.గత పాలకులు వెయ్యి ఎకరాల్లో ఎర్ర వల్లిలో , ఫామ్ హౌస్ 100 ఎకరాల్లో జన్వాడలో కేటీఆర్ , హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు.ఒక్క కేసీఆర్ క్లాస్ మెంట్ జాహంగీర్ కు మాత్రమే ఇప్పటి వరకు ఏమీ రాలేదు.
టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు కేసీర్ కుటుంబానికి వచ్చాయి. కాని పేదలకు డబల్ బెడ్రూం ఇళ్లు రాలేదు..
ఏడాది కి 2 లక్షల ఇళ్లు కడితే పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టే అవకాశం కేసీఆర్ కు ఉండేది..
కాని పేదల ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదు.. పేదలపైన ఆయనకు ప్రేమ లేదు..
భూపాలపల్లిలో రైతు పోరాట బాట, కార్మికుల పోరు బాట నేను గతంలో నిర్వహించాను..
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం.. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం..
వచ్చే బడ్జెట్ లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం..
పేదల ఆత్మగౌరవం పెరిగేలా , ఆడబిడ్డలు ఆశ్వీరధించేలా ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత మంజూరు చేస్తాం..
సరస్వతి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించుకున్నాం..
1000 ఏళ్లు గుర్తుండేలా మేడారం ఆలయం నిర్మించాం..
సమ్మక్క సారలమ్మ జాతరను అద్భుతంగా నిర్మించాం..
జంపన్న వాగు నుంచి రామప్ప చెరువుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.కొండా సురేఖ, సీతక్క మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించారు.2027 లో రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు పర్యాటక ప్రాంతంగా 3, 4 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాం.గోదావరి పరిహాక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం..ప్రజా
ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి …అపుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి.పదేళ్లు సీఎంగా ఉండి భూపాలపల్లి కి బై పాస్ రోడ్డు తీసుకురాలేదు..
మాయ మాటలు చెప్పే వాళ్లకు ఓటు వేస్తే మోసపోతారు జాగ్రత్త..
తెలంగాణ లో మున్సిపాలిటీలు, కార్పేరేషన్ల కు 17,442 కోట్లు మంజూరు చేశాం..
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు 6116 కోట్లు మంజూరు చేశాం.భూపాలపల్లి మున్సిపాలిటీకి 92 కోట్ల నిధులు మంజూరు చేశాం..

మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న గత పాలకుని తీరు తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్లుంది ..
గత పాలకులు ఇంటిల్లిపాలికి పదవులు ఇచ్చుకున్నాడు.. కాని పేదలకు ఏమీ చేయలేదు.
ఎవరకి వారు వాళ్లు తమ సామాజిక వర్గం పేరుతో నన్ను పిల్చుకున్నారు.. ఎవరు ఎలా పిలిచినా సంతోషిస్తా.
వేలకోట్ల ఆస్తులను పేదలకు దానం చేసిన
గాందీ కుటుంబంపైన ఈడీ , సీబీఐ ని ఉపయోగిస్తున్నప్పుడు కాళేశ్వరం పైన సీబీఐ విచారణకు పంపిస్తే ఎవరు అడ్డుకుంటున్నారు..
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను కాపాడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, సినీతారలను వదలలేదు.భార్యభర్తలు ఫోన్లు విన్న పాపాత్ముడు ఎవరైనా ఉంటారా..
వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేశారు.వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి మాటలు విని ఆస్తులురాయించుకున్నారు
టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు దోచుకున్నారు.భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రజల ఆశీర్వాదం ఉండాలి..
ఇందిరమ్మ చీరల్లో
మా అక్కలు దసర పండుగ రోజు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు..
ఇందిరమ్మ చీర ను సారె రూపంలో మీ తమ్ముడు పెట్టాడు.ప్రతి యేడాది ఇందిరమ్మ చీరను సారె గా తప్పకుండా ఇస్తాం.. ఆడబిడ్డల ఆశ్వీరాధం ప్రజా ప్రభుత్వానికి ఎల్లపుడూ ఉండాలి.అనంతరం మహిళా సంఘాలకు 205 కోట్ల రూపాయలు బ్యాంకు లికేంజి అందాచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు డా కడియం కావ్య, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, 20 సూత్రాల అమలు చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సింగరేణి కార్మిక సంగం చైర్మన్, గ్రంధాలయ సంస్థ చైర్మన్లు రాజబాబు, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
