
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
కేటీకే 6 ఇంక్లైన్ నందు ఐఎన్టియుసి భూపాలపల్లి ఏరియా ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య అధ్యక్షతన బాయి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు అనంతరం మాట్లాడుతూ
మే 13వ తేదీన జరగబోవు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య చెయ్యి గుర్తు పై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో వుండి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవైట్ పరం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సింగరేణికి బొగ్గు బ్లాక్ లను కేటాయించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, కార్మికులకు ఆదాయ పన్ను రద్దుకు కృషి చేస్తామని తెలియజేశాడు… బిజెపి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని తెలంగాణకు రావలసిన ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందని, కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోడీ గుజరాత్ కు తీసుకువెళ్లాడని, బయ్యారం ఉక్కు కర్మాగారం వూసే లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ రాష్ట్ర నాయకులు అప్పం కిషన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు పసునూటి రాజేందర్, బ్రాంచ్ కమిటీ నాయకులు, ఫిట్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.