కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో బోర్ ఏర్పాటు
జహీరాబాద్. నేటి ధాత్రి:
డైవర్స్ కాలనీలో నీటి సమస్యను స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు.దీంతో గురువారం రోజున బోర్ డ్రిల్ చేసేందుకు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బోర్ తవ్వకాన్ని ప్రారంభించారు.ప్రజలు నీటితో కష్టాలు పడకుండా ఉండేందుకు బోర్ డ్రిల్ చేయిండం పట్ల స్థానిక ప్రజలు హర్షవ్యక్తం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా౹౹ఉజ్వల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్, ప్రతాప్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,బి.మల్లికార్జన్,అక్బర్,హర్షద్ పటేల్,ముస్తఫా,నిజాం,బర్కత్ మరియు డైవర్స్ కాలనీ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.