Congress Leaders Celebrate Ujwal Reddy’s Birthday
ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ అక్టోబర్ 30 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ.నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో గురువారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు,ప్రజలకు పండ్లు, బ్రెడ్ పాకెట్ లు పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,నిరంతరం ప్రజా జీవితంలో ఉండాలని వారు అన్నారు.ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,సీనియర్ నాయకులు జాఫర్,మోతిరాం నాయక్,జహంగీర్,రాములు నేత,యూనూస్ మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ ఆయా మండలాల అధ్యక్షులు జి.కిరణ్ కుమార్ గౌడ్,సునీల్,సుభాష్ యాదవ్,రాఘవేందర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లా.ప్రతాప్ రెడ్డి,రాజు నాయక్,మల్లికార్జున్,జహీర్ అరబ్బీ,అక్రమ్,అయ్యూబ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
