పలు కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామంలో నల్లబెల్లి మల్లమ్మ చనిపోగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపినారు.. జూకల్ గ్రామంలోని అన్నం కొమురయ్య చనిపోగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అనంతరం తాడిశెట్టి లక్ష్మి మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఆమె ఇవ్వడం జరిగినది..నవాబుపేట గ్రామ కరోబార్ జిల్లాల కుమార్ ప్రమాదవశత్తు బైక్ నుండి పడి చనిపోగా చిట్యాల ప్రభుత్వ హాస్పటల్ కి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో నైన్ పాక గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య , కంకనాల శంకర్ , పాలడుగుల రఘుపతి , బిక్కనూరి విజయ్ జూకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు సూర నరేందర్ , మండల ఉపాధ్యక్షుడు దొంతి రాంరెడ్డి , రేగురి స్వామి రెడ్డి , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ , నాగరాజు , అందుగుల రాజు , మధుకర్ , రాము , మధు , సదనందం , చింతల సుమన్ , మేకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు…