
ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని గుంటూరు పల్లి లో మంగళవారం రోజున ఇందిరమ్మ ఇళ్లకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే సత్తన్నకు దక్కిందని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలలను తీర్చలేదని 10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు, అలాగే మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటనలో మాట్లాడుతూ కాలేశ్వరం లో మోటార్లు పెట్టడం లేదని నిరాహార దీక్ష చేస్తామనడం ఎందుకో చెప్పాలని దొరల ఫామ్ హౌస్ లోకి నీళ్లను పంపడం కోసమేనా అని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దన నాగరాజు కాంగ్రెస్ నాయకులు పాశం లక్ష్మీనారాయణ నర్రా శివరామకృష్ణ మునిమాకుల నాగేశ్వరరావు తిరుపతయ్య సాంబయ్య కాంగ్రెస్ పార్టీ యూత్ మండల్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.