#దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసిన మహోన్నత వ్యక్తి.
#ఆయన చేసిన సేవలు దేశ ప్రజలకు ఆదర్శప్రాయుడు.
#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.
నల్లబెల్లి నేటి ధాత్రి: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అకాల మరణం చెందగా మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి గాన నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి కొరకు కొట్లాడిన వ్యక్తి అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి మద్దతు తెలిపిన మహనీయుడు అలాంటి వ్యక్తి అకాల మరణం చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, యూత్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్ , మండల ఉపాధ్యక్షుడు పెంతల కొముర రెడ్డి , నాయకులు మామిండ్ల కొమురయ్య , పూల్ సింగ్ మామిండ్ల రాజి రెడ్డి , అజ్మీరా తిరుపతి , సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు