నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

– మెదక్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి….

– సమావేశానికి హాజరైన కొల్చారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్, దేవన్న గారి శేఖర్…

కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :-

గురువారం నాడు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారు ఈనెల 20వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. వారితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ విచ్చేస్తూనారు అని తెలిపారు. మెదక్ రాందాస్ చౌరస్తాకు ఉదయం 10:00గంటలకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.కావున ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పార్టీ నేతలు నాయకులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకుల వరకు పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా కాపాడుకున్నరో అదేవిధంగా దేశని కూడా కాపాడుకోవడనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల పనిచేయాలని అన్నారు. ఒకరు మతం వాదంతో మరొకరు ప్రాంతీయవాదంతో ముందుకు వెళుతున్నరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేశాని కాపాడుకోవలి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు విచ్చేసిన తరుణంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్రోహి అని అన్నాను. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీకి నమ్మకద్రోహం చేశారన్నారు. గత ప్రభుత్వంలో వడ్ల కల్లాల వద్ద రైతులు మరణించిన పట్టించుకోలేదు అన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అన్నారు. ప్రజా పాలనలో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు పరచామన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారిని గెలిపించి సోనియా గాంధీ గారికి గిఫ్టు ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జడ్పీటీసి శ్రీనివాస్ గుప్తా, కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవన్న గారి శేఖర్, అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,బ్లాక్ అధ్యక్షులు , మహిళ అధ్యక్షులు, యుత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు అనుబంధ సంస్థ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!