
MLA Gandra Venkata Ramana Reddy
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి.
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించకుండా డైవర్షన్ పాలిటిక్స్ ను చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని నిబద్ధతతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే దృక్పథంతో నిర్మించారని గత పాలకులు ఎవరు ప్రజల ప్రయోజనాన్ని గుర్తించలేదని తెలిపారు.సర్దార్ కాటన్ ధవలేశ్వరం ప్రాజెక్టు సంవత్సరాల తరబడి నిర్మాణం చేశారు కానీ అయిన పైన కూడా కమీషనర్లు ఎంక్వయిరీ చేసి అనేక ఇబ్బందులకు గురిచేసినారు గత ప్రభుత్వాలు అని వారు అన్నారు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని విద్యా వైద్యం రంగాలలో అధిక ప్రాధాన్యతనిస్తూ మహాత్మ జ్యోతిరావు పూలే కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించడంలో అధికారులు విఫలమయ్యారు ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి అని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కటకం జనార్ధన్ పినిశెట్టి రాజిరెడ్డి సేగ్గం వెంకట్రాణి సిద్దు కల్లెపు రఘుపతిరావు గండ్ర హరీష్ రెడ్డి మేకల సంపత్ కుమార్ యాదవ్ కవిత జుమ్మలాల్ శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.