బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి
పరకాల నేటిధాత్రి తెలంగాణలో రైతు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పరకాల పట్టణ బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి అన్నారు.ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు రైతు,రైతు బీమా, మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే లేనివిధంగా మన రాష్ట్రంలో అమలుపరిచి ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఈ సంక్షేమ పథకాలన్నీ బూజు పట్టాయని అన్నారు.పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే రైతన్నలకు రుణమాఫీ జరుగుతుందని, లేకుంటే ఆగస్టు 15 తారీకును మళ్లీ రేవంత్ రెడ్డి పెంచుతాడని గుర్తు చేశారు.రైతన్నలు అందరు ఒక్కసారి ఆలోచించి రైతు పక్షపాతి కెసిఆర్ బలపరిచిన బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.