
Congress Champions Farmers’ Welfare in Jaipur
రైతుల సంక్షేమం కోరి _ కాంగ్రెస్ పార్టీ సమరభేరి
జిల్లా ప్రధాన కార్యదర్శి: రిక్కుల శ్రీనివాస్ రెడ్డి
జైపూర్,నేటి ధాత్రి:
రైతుల సంక్షేమం కోసమే గల్లి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,నాయకులు రైతుల తరఫున కేంద్రంతో పోరాడుతున్నారని,బిజెపి- బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతు సమస్యలపై నోరు మెదపట్లేదనీ,చోద్యం చూస్తున్నారు అని జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను ఆదుకోలేని బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పడం అవివేకం అని మండిపడ్డారు.యూరియా కేటాయింపులో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని,మాటలు కాదు,చర్యలు ముఖ్యమని,రైతులకు ఎరువులు తెప్పించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.బీజేపీ–బీఆర్ఎస్ చేతగానితనం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని రిక్కుల శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు చేసిందని నేతలు వివరించారు.ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంమని,బీజేపీ–బిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని,ప్రజల ఆదరణను జీర్ణించుకోవడం లేదనీ,అందుకే వారు నిరాధార ఆరోపణలకు తెగబడుతున్నారనీ ఎద్దేవా చేశారు.చెన్నూర్ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిరంతరం సంక్షేమ పథకాలతో,అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీలం వెంకటేశం,ఆసంపల్లి శ్రీకాంత్,గద్దల అనిల్ కుమార్, సుమన్,షారుక్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.