ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రం విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం
మాట్లాడుతూ హత్యలు అరాచకాలకు అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్ గా పుట్ట మధుకర్ నిలిచిపోయాడు అన్నారు..
నీ యొక్క శిష్యుడు రాజిరెడ్డి ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా ఓడేడ్ గ్రామానికి సర్పంచ్ అయినా సిరికొండ బక్కారావు అతని సతీమణి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో భాగంగా తరలి వెళుతుంటే రాజిరెడ్డి తన అనుచరులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేయడానికి రాడ్లతో భార్యాభర్తలను చంపించే ప్రయత్నం చేసింది నువ్వు కాదా..
పదేపదే దివంగత శ్రీపాద రావు గురించి మాట్లాడుతున్నవ్ ఒకటే చెబుతున్నా నీవు పురుగుల వడిపోతావ్
శ్రీపాద రావు 15 సంవత్సరాలు శ్రీధర్ బాబు 25 సంవత్సరాలు మంథని నియోజకవర్గ ప్రజలు దీవించడం వల్ల 8 పర్యాయాలు శ్రీపాద రావు కుటుంబాన్ని ప్రజలు ఎన్నుకున్నారు ప్రజల తీర్పును గౌరవించి శ్రీపాద రావు కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు
గట్టు నాగమణి వామన్ రావు దంపతులను కోడి పిల్లను కోసినట్లు నడిరోడ్డుపై హత్య చేసింది నీ అనుచరులు కాదా.?
ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి నియోజక వర్గానికి రానున్న రోజుల్లో భారీగా నిధుల వరద తెప్పించి మంథని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో చూపించబోతున్నారు నీకు ఇక నూకలు చెల్లిబోయినయి ఖబర్దార్ మా నాయకుల పైన ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేసిన ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారు..మంథని క్యాంపు కార్యాలయంలో దాసరి శివకుమార్ ని శ్రీధర్ బాబు దాచి పెట్టినాడు అని అబద్ధాల మాటలు మాట్లాడుతున్నావు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేదా సనాతన హిందూ ధర్మం ప్రకారం నేను సవాలు విసురుతున్న ఏదైన దైవ సన్నిధిలో ప్రమానానికైనా మేము సిద్ధం నువ్వు సిద్ధమా అని చొప్పరి సదానందం సవాల్ విసిరారు..
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, కిసాన్ సెల్ మండలాధ్యక్షుడు గాదం శ్రీనివాస్,గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనము సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల్గ0 సంపత్,జక్కుల రమేష్,కోల విజయ్,గుడి లింగయ్య, బాలసాని రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..