కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. వి. నరేందర్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. నరేందర్ రెడ్డి నామినేషన్‌కు నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు హజరై నరేందర్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో హజరైన పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లిన నరేందర్ రెడ్డి తన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ కార్యమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, బోధన్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆదిలాబాద్ పార్లమెంటు కంటెస్టెట్ ఆత్రమ్ సుగుణ, మానాకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ రాకూర్ ఇతర నాయకులు హజరయ్యారు. అందరు నాయకులకు ఆత్మీయ స్వాగతం పలికిన నరేందర్ రెడ్డి తర్వాత నామినేషన్ కు బయలుదేరారు.
అట్టహాసంగా నరేందర్ రెడ్డి నామినేషన్.
