
హసన్ పర్తి / నేటి ధాత్రి
వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామం లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి డాక్టర్ కడియం కావ్య ను గెలిపించాలని గడప గడపకు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి గ్రామ శాఖ కమిటీతో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.