రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 52 వ బూత్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బూత్ కో ఆర్డినేషన్ టీం సభ్యులు మహంకాళి శ్రీనివాస్, గోపతి బానేష్, కనుక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. బూత్ స్థాయి లో పార్టీ ని బలోపేతం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించుకోవాలో, వ్యూహరచన చేయాలనీ మాట్లాడుకోవడం జరిగిందని అన్నారు. బూత్ లో వున్నా ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నా విధానాన్ని తెలియజేసి పార్టీ కి ఓట్లు వేయించి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించే విధంగా పని చేయాలని బూత్ కమిటీ సభ్యులకు సూచన చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు గుర్రం శ్రీనివాస్ పందిరి లింగయ్య, రాయ నర్సు భేమాష్ గుర్రం అనిల్, తదితరులు పాల్గొన్నారు.