కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు… మాదిగ మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు తెలిపిన

తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుట్ల సమ్మయ్య మాదిగ

ముత్తారం :- నేటి ధాత్రి

ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగ, జాతీయ రాష్ట్ర అధ్యక్షుల పిలుపుమేరకు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ముత్తారం మండలం మరియు ఓడేడు గ్రామంలో మాదిగ వాడలో సమావేశం ఏర్పరచుకొని ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగినది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీధర్ బాబు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా దళితుల కోసం అనేక సంక్షేమ ఫలాలు తీసుకురావడం జరిగినది ముఖ్యంగా ఆరు గ్యారెంట్లు ప్రజల అభివృద్ధికి ఎంతగానో దోహదం పడుతయి కాంగ్రెస్ ప్రభుత్వము దళితుల కోసం అనేకమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగినది దళితులారా తస్మాత్ జాగ్రత్త బిజెపి ప్రభుత్వం మళ్ళీ వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను తొలగిస్తరు టిఆర్ఎస్ పార్టీ మూడెకరాల భూమి ఇయ్యలే, డబల్ బెడ్ రూమ్ ఇయ్యలే దళితులకు అన్ని మోసాలే, ఎస్సి ఎస్టీ బిసి లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీ కృష్ణ ను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ టిఎంహెచ్డీ మంతిని నియోజకవర్గం నాయకులు మాట్ల రవి మాదిగ, పాల సిద్ధార్థ, శ్రీకాంత్ రాకేష్ మంథని కుమార్, ఎనుముల రమేష్. అధిక సంఖ్యలో మహిళలు మాదిగలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!